telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

మదనపల్లి కూతుళ్ల హత్యల కేసు : భయంకర విషయాలు బయటపెట్టిన డాక్టర్లు !

చిత్తూరులోని మదనపల్లిలో జంటహత్యలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కూతుళ్లను హత్యచేసినట్లు ఒప్పుకున్నారు తల్లిదండ్రులు. దీంతో తల్లిదండ్రులు పురుషోత్తమ్‌, పద్మజలకు 14 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు. ఈ మేరకు మదనపల్లి సబ్‌జైలుకు నిందితులను తరలించారు. క్షద్రపూజల పిచ్చితో ఇద్దరు కూతుళ్లను తల్లిదండ్రులు చంపిన విషయం తెలిసిందే. అయితే… సబ్‌ జైలుకు తరలించే ముందు పురుషోత్తంనాయుడు, పద్మజలకు మానసిక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు కీలక విషయాలను బయటపెట్టారు. “డెల్యూషన్స్‌” అనే మానసిక వ్యాధితో బాధపడిన పద్మజ… ఇటీవలే అదే మానసిక వ్యాధితో పద్మజ తండ్రి చనిపోయారని డాక్టర్లు పేర్కొన్నారు. పద్మజ మేనత్త కూడా డెల్యూషన్స్‌ వ్యాధిగ్రస్తురాలు అని.. అదే వ్యాధిని భర్త, కూతుళ్లకు పద్మజ అంటించిందని వెల్లడించారు. వ్యాధిగ్రస్తులు తాము నమ్మిన విషయాన్నే బలంగా విశ్వసిస్తారని.. చికిత్స తర్వాత పురుషోత్తం, పద్మజ వ్యాధి నుంచి కోలుకుంటారని పేర్కొన్నారు. పురుషోత్తం నాయుడికి కూడా మానసిక సమస్య వచ్చిందని వైద్యులు తెలిపారు.

Related posts