telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్‌కు మళ్లీ షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు

Vijay

ఏజీఎస్ సంస్థ విజయ్, యువ దర్శకుడు అట్లీ కలయికలో ‘బిగిల్’ చిత్రాన్ని నిర్మించింది. స్పోర్ట్స్ అండ్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడమే కాక, సుమారు రూ. 250 నుండి రూ. 300 కోట్ల మేరకు వసూళ్లు సాధించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో మధురైలోని పలు కార్యాలయాలపై ఐటీ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం విజయ్ నటిస్తున్న‘మాస్టర్’ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న లలిత్ కుమార్ ఇంటిలో సోదాలు జరిపారు. తాజాగా గురువారం ఉదయం తమిళనాడు పణయూర్ఇల్లంలోని విజయ్ నివాసానికి ఆదాయపు పన్నుశాఖ అధికారుల బృందం చేరుకుని సోదాలు చేపట్టారు. ఏలాగోలా ఈ వివాదం సద్దుమణిగింది అనుకుంటుండగా ఐటీ అధికారులు విజయ్‌కు మళ్లీ షాక్ ఇచ్చారు.

Related posts