telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేపే సీఎం కేసీఆర్ జనగామ జిల్లా పర్యటన..

kcr stand on earlier warning to rtc employees

జనగాం జిల్లా కొడ‌కండ్ల రైతు వేదిక‌ను మద్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతు వేదికను ప్రారంభించనున్నారు. రైతులను సంఘటిత పరిచేందుకు 2017 సెప్టెంబర్ 15న, సిఎం, రైతుబంధు సమితులకు రూపకల్పన చేయనున్నారు. రాష్ట్రంలో 10,733 గ్రామాల్లో రైతుబంధు సమితులు ఏర్పాటు చేయనున్నారు. గ్రామ స్థాయిలో 15మంది రైతులతో, మండలస్థాయిలో 24 మందితో, జిల్లాస్థాయిలో 24 మందితో, రాష్ట్రస్థాయిలో 42 మంది సభ్యులతో
మొత్తం 1 లక్షా 61 వేల మంది రైతులు సభ్యులుగా రైతు సమన్వయ సమితులు ప్రారంభించనున్నారు. రూ.573 కోట్లతో 2,604 క్లస్టర్లలో రైతు వేదికలు ప్రారంభించనున్నారు.
రైతులు, వ్యవసాయాధికారులు, రైతుబంధు సమితి సభ్యులు, శాస్త్రవేత్తలు సమావేశమయ్యేలా ప్రభుత్వం రైతు వేదికలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్ గా విభజించి, ప్రతీ క్లస్టర్ లో రూ.22 లక్షల ఖర్చుతో ఒక రైతు వేదిక ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2,604 వ్యవసాయ విస్తరణాధికారుల క్లస్టర్లలో 2 వేలకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో రైతు వేదికల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.573 కోట్లు ఖర్చు చేయనున్నారు.
రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని సిఎం సందర్శిస్తారు. ఈ సందర్భంగా రైతులతో ముఖ్య‌మంత్రి నేరుగా ముఖాముఖి మాట్లాడ‌తారు.

Related posts