telugu navyamedia
రాజకీయ వార్తలు

కొత్త వ్యవసాయ చట్టాలు అందుకు ముందడుగు : అంతర్జాతీయ ద్రవ్యనిధి

pension to farmers in kerala

భారత దేశ వ్యవసాయ రంగంలో పెను మార్పులకు మూడు కొత్త వ్యవసాయ చట్టాలు కీలకమైన ముందడుగు అని అంతర్జాతీయ ద్రవ్యనిధి వ్యాఖ్యానించింది. 9 వ విడత రైతులు-ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్న తరుణంలో మూడు వ్యవసాయ చట్టాల వల్ల ఒనగూడే ప్రయోజనాలను బేరీజు చేస్తూ అంతర్జాతీయ ద్రవ్యనిధి ఈ వ్యాఖ్య చేసింది. అయుతే, వ్యవసాయ రంగంలో జరగనున్న ఈ మార్పుల వల్ల ప్రభావం చూపే వారికి సరైన రీతిలో నష్టపరిహారం కల్లించాల్సి ఉందని కూడా వ్యాఖ్యానించింది. నష్టపోయే ఆయా వర్గాలకు ప్రత్యామ్నాయ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొత్త వ్యవస్థ కు మారే క్రమంలో సామాజిక భద్రత కూడా పరిగణన లోకి తీసుకోవాలి. నూతన చట్టాలు గ్రామీణ అభివృద్ధికి దోహదం చేస్తాయి. రైతులు నేరుగా కొనుగోలుదారుల తో నేరుగా ఒప్పందాలు చేసుకోనే వాలింది. దీనివల్ల రైతుల సామర్ద్యం మరింత పెరిగనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అభిప్రాయపడింది. అయితే నేడు మధ్యాహ్నం రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం 9 వ విడత చర్చలు జరపనుంది. మూడు వ్యవసాయ చట్టాల రద్దు ప్రధాన అజెండా గా చర్చలు జరగనున్నాయి.

Related posts