telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కోటి వృక్షార్చనలో పాల్గొన సీఎం కేసీఆర్…

నేడు తెరాస కార్యకర్తలకు, అభిమానులకు పెద్దపండగ రోజు అని చెప్పాలి.  ఎందుకంటే ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు.  ఫిబ్రవరి 17, 1954 వ సంవత్సరంలో జన్మించారు.  తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2001 లో సొంతంగా తెరాస పార్టీని స్థాపించారు.  పార్టీని ముందుండి నడిపించడమే కాకుండా, రాష్ట్రాన్ని సాధించేవరకు వెనకడుగు వేయకుండా పోరాటం చేశారు.  కెసిఆర్ పోరాటానికి ఫలితం 2014లో కనిపించింది.  2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది.  ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో తెరాస పార్టీ ఘనవిజయం సాధించింది.  కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.  అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.  పచ్చదనానికి ప్రాముఖ్యత ఇస్తూ వస్తున్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి ప్రార్ధన మేరకు ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా “కోటి వృక్షార్చన”లో పాల్గొని రుద్రక్ష మొక్కను నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ను అభినందించారు.

Related posts