telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ టైటిల్ లో కాఫీ తాగాలనుకుంటున్న : షారుఖ్‌

ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభానికి మరో వారం రోజులే ఉండడంతో ప్రాంచైజీ యజమానులు సోషల్ మీడియాలో సందడి మొదలెట్టారు. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సహా యజమాని, బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌.. బుధవారం ట్విటర్‌ వేదికగా ‘#AskSRK’ ప్రారంభించారు. దీనిలో భాగంగా పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు షారుఖ్‌ సమాధానమిచ్చారు. చిట్‌చాట్‌ సందర్భంగా ఓ నెటిజన్ షారుఖ్‌ ఖాన్‌ను ఇలా అడిగారు. ‘భయ్యా ఈ సారి అయినా మన టీం కప్పు కొడుతుందా?’ అని ప్రశ్నించాడు. అందుకు షారుక్‌ తనదైన శైలిలో బదులిచ్చారు. ‘నేను కూడా కేకేఆర్‌ కప్ కొట్టాలనే కోరుకుంటున్నాను. కేకేఆర్‌ టైటిల్ గెలిస్తే.. ఆ కప్పులో కాఫీ తాగాలని భావిస్తున్నాను’ అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ అయింది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తొలి మూడు సీజన్లలో లీగ్‌ దశలోనే ఆగిపోయిన.. గౌతమ్‌ గంభీర్‌ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 2012, 2014 విజేతగా నిలిచింది. ఆ తర్వాత ప్లేఆఫ్‌ వరకూ వెళ్తూ వచ్చింది. మరి ఈ ఏడాది ఏం జరుగుతుంది అనేది చూడాలి.

Related posts