హైదరాబాద్ లో మరో మిస్సింగ్ కేసు నమోదైంది. కూకట్‌పల్లిలో తల్లి, ఇద్దరు పిల్లలు కనిపించకుండా పోయారు. రెండు రోజులు గడుస్తున్న జాడ లేని ముగ్గురు ఆచూకీ..దీంతో భర్త, కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూకట్‌పల్లి పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మూసాపేట్‌లోని రాజీవ్‌గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న ప్రేమయ్య, మానసలు..బుధవారం మధ్యాహ్నాం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామని మానస చెప్పింది. సాయంత్రం మానస మొబైల్ కు కాల్ చేసిన ప్రేమయ్య..స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన చెందాడు.దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే..దీనిపై మానస భర్త ప్రేమయ్య మీడియా తో మాట్లాడారు. బుధవారం తాను డ్యూటీలో ఉన్న సమయంలో ఫోన్ చేశారని..మధ్యాహ్నం ఫోన్ చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని తన కూతురు చెప్పిందన్నారు. సాయంత్రం వచ్చి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వచ్చిందని..ఇప్పటి వరకు ముగ్గురి ఆచూకీ లభించలేదని ఆవేదన చెందాడు. మానస ఎక్కడ ఉన్నా పిల్లలను తీసుకొని ఇంటికి రా..ఎవరూ ఏమి అనరని వేడుకున్నాడు.
previous post