telugu navyamedia
క్రీడలు వార్తలు

బుమ్రా రాణిస్తే భారత్ దే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్…

టీమిండియా పేస్‌ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్న బుమ్రా టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే ఈ యార్కర్ల కింగ్ 83 వికెట్లు తీసి సత్తా చాటాడు. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్థాంతరంగా వాయిదా పడటంతో టీమిండియా అప్ కమింగ్ డబ్ల్యూటీసీ ఫైనల్‌‌పై దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ఇండియా న్యూస్‌కు ఇచ్చిన తాజాగా మాజీ క్రికెటర్ సబా కరీం మాట్లాడుతూ… జస్‌ప్రీత్ బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించాడు. టెస్ట్‌ల్లో 400 వికెట్లు తీసే సత్తా బుమ్రాకు ఉందన్న వెస్టిండీస్ దిగ్గజం కర్ట్ అంబ్రోస్ వ్యాఖ్యలతో సబా కరీం ఏకీ భవించాడు. ‘బుమ్రా గురించి కర్ట్‌లీ అంబ్రోస్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా. మూడు, నాలుగు ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూశాను. బుమ్రా మంచి ఫాంలో ఉన్నాడు అనిపించింది. తనొక ప్రత్యేకమైన బౌలర్‌. మూడు ఫార్మాట్లలోనూ మెరుగ్గా రాణిస్తున్నాడు. టీమిండియాకు ప్రస్తుతం ఉన్న ప్రధాన పేసర్‌ తను. షార్ట్‌ బంతులు సంధించి వికెట్లు పడగొట్టగలడు. తనదైన శైలిలో బౌలింగ్‌ చేస్తూ జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న బుమ్రా.. డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా ఇదే జోరు కొనసాగిస్తాడనే నమ్మకం ఉంది. తను ఫాంలో ఉంటే భారత్‌కు గెలిచే అవకాశాలు పెరుగుతాయి అన్నాడు.

Related posts