కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్సీ సవాల్ విసిరాడు. అయితే తెలంగాణలో విపక్షాలకు మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ విసరడంతో ఈ పొలిటికల్ హీట్ పుట్టింది.. తన హయాంలో లక్షా 32,799 ప్రభుత్వ రంగ ఉద్యోగాలిచ్చామన్న ఆయన.. ఉమ్మడి ఏపీలో 2004-14 మధ్య 10 వేల ఉద్యోగాలే ఇచ్చారని… ఉద్యోగాలపై చర్చకు ఎక్కడైనా సిద్ధం అని ప్రకటించారు కేటీఆర్.. ఇప్పటికే కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ చర్చకు సిద్ధమని ప్రకటించగా… ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు.. మంత్రి కేటీఆర్‌కు ప్రతిసవాల్ విసిరారు.. కేటీఆర్‌తో లైవ్ చర్చకు సిద్ధమన్న ఆయన.. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ముందు చర్చించే దమ్ముంటే రావాలంటూ.. మంత్రి కేటీఆర్‌కు సవాల్ చేశారు బీజేపీ ఎమ్మెల్సీ… ఇక, ఐటీఐఆర్ విషయంలో మీ అబద్ధాలు పార్లమెంట్ సాక్షిగా బయటపడ్డాయని ఫైర్ అయిన రాంచందర్‌రావు.. ఎయిమ్స్‌కి ల్యాండ్ ఇవ్వడం లేదు.. ఎంఎంటీఎస్ వాటా ఇవ్వడంలేదు.. కేంద్రం నుంచి వస్తున్న విధుల గురించి చెప్పడం లేదు అని ఫైర్ అయ్యారు.. కేటీఆర్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే అని ఆరోపించారు రాంచందర్‌రావు. చూడాలి మరి దీని పై కేటీఆర్ ఎలా స్పందిస్తాడు అనేది.
previous post