telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కనికరం లేని కరోనా

కరోనా విడ్డూరం కాదే

ఇది కరోనా విడ్డూరం కాదే

టీనేజీ దాటని కోవిడ్ అంట

దేశాలు పట్టీ దాడి అంట

ఇంట్లొ దాక్కుని ఉన్నారంతా

కంటికసలే కానరాదు

ప్రాణి అంటే కానేకాదు

ముట్టుకుంటే వదలి పోదు

 

అధిక బరువు జబ్బునొకడు

తిన్నదరగక దొర్లేనొకడు

డొక్క ఎండీ చిక్కేనొకడు.

 

దిగుమతైనా కుక్కతోనొకడు

గోల్డు చైను పిల్లితో నొకడు

వీధికుక్కతో పోటీ ఒకడు

 

మందులింకా రానేలేదు

వాక్సిన్ను జాడా అసలే లేదు

బాబా స్వాములు చిరునామా లేరు

 

బాలాజి గుడిని వదలిరాడు

క్రీస్తు చర్చిని తెరవనీడు

డాక్టర్లు దేవుళ్ళయ్యారు చూడు.

 

మనిషికొక్క జాతకముగా

నమ్మబలికే జ్యోతిష్యమ్ముగా

నక్షత్ర రాశులు ఏకమవ్వగా.

 

పెద్దన్న గర్వం ఎక్కే నాడు

సోదరులు అల్లాడేను చూడు

వసుధైక బంధం వచ్చె నేడు.

 

దీని తల్లితండ్రి ఊసు చూడు

ముత్తాత వివరమ్ము చూడు

విద్యాలయాలు కావాలి నేడు

 

మతాలను పోషించేదొకడు

అంతరాలను పెంచేదోకడు

జ్ఞానమొక్కటి శాస్త్రజ్ఞుడొక్కడు

Related posts