telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గంధర్వుల కోసం పాడేందుకు వెళ్లావా?… తీవ్ర భావోద్వేగానికి లోనైన ఇళయరాజా

SPB

లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం అందరినీ శోకసంద్రంలో ముంచేసింది. సినీ ఇండస్ట్రీ బాలు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటోంది. ఈ క్రమంలోనే బాలు ప్రాణ మిత్రుడు సంగీత దిగ్గజం ఇళయరాజా ఆయన మరణం పట్ల సంతాపం తెలుపుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ”ఎక్కడికి వెళ్లావు? ఎందుకు వెళ్లావు? గంధర్వుల కోసం పాడేందుకు వెళ్లావా? ఇక ప్రపంచంలో నేను దేన్నీ చూడలేను. ఎంతటి దుఃఖానికైనా ఓ హద్దు ఉంటుంది.. కానీ నీ విషయంలో దానికి పరిమితి లేదు” అంటూ కంటతడి పెట్టుకున్నారు ఇళయరాజా. ఈ రోజు (శనివారం) బాలు అంత్యక్రియలు రెడ్‌హిల్స్‌లోని ఆయన ఫామ్‌హౌస్‌లో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

Related posts