telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

మైక్రో ఫైనాన్స్ యాప్ ల వెనుక చైనా హస్తం..

మైక్రో ఫైనాన్స్ ఆన్‌ లైన్‌ యాప్ ల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా… ఈ మైక్రో ఫైనాన్స్ యాప్ ల వెనుక చైనా హస్తం ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో చైనాకు చెందిన మహిళ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఢిల్లీలో చైనా మహిళ ని అదుపులోకి తీసుకున్న అధికారులు.. ట్రాన్సిట్ వారంట్ మీద చైనా మహిళను హైదరాబాద్ కు తీసుకొని రానున్నారు. ఢిల్లీ, గుర్గావ్, బెంగళూరులో హైదరాబాద్ కాల్ సెంటర్లు పెట్టింది ఈ చైనా మహిళ. అయితే… ఈ చైనా మహిళ కి పూర్తి స్థాయిలో నాగరాజ్, మధుకర్ సహకరించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నిందితులు నాగరాజ్, మధుకర్ ల కోసం దేశవ్యాప్తంగా గాలిస్తున్నారు పోలీసులు. ఆ ఇద్దరు నిందితులు చిక్కితే.. మరిన్నీ విషయాలు బయటపడనున్నాయి. ఇది ఇలా ఉండగా.. ఆన్ లైన్ కాల్ మనీ కేసులో మరో ముఠా అరెస్ట్ అయింది. నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసారు సైబరాబాద్ పోలీసులు. ఇద్దరు చైనీస్ తో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసారు పోలీసులు. 2 కోట్లు నగదు, 2 లాప్ టాప్ లు, 4 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.

Related posts