telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఇక ప్ర‌తీ వ్య‌క్తికి 15 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం…

rice supply

తెలంగాణలో ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కారణంగా స‌డ‌లింపులు ఉన్న రంగాలు త‌ప్పితే.. లాక్‌డౌన్‌తో అంతా ఇళ్ల‌కే ప‌రిమితం అవుతుండ‌డంతో.. పేద‌ల‌కు తిన‌డానికి తిండిలేక‌.. దాత‌ల కోసం ఎదురుచూసే ప‌రిస్థితి ఉంది. వారికీ అండగా ప్ర‌భుత్వం నిలుస్తుంది. పేద‌ల క‌డుపు నింపేందుకు సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.. జూన్ నెల‌లో ప్ర‌తీ వ్య‌క్తికి 15 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అంద‌జేయ‌నున్నారు.. దీంతో.. రాష్ట్రంలోని 2 కోట్ల 79 లక్షల 24 వేల 300 మందికి ల‌బ్ధి చేకూరుతుంద‌ని తెలిపారు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌.. రాష్ట్రంలోని మొత్తం 87లక్షల 42వేల 590 కార్డులకు ఎలాంటి పరిమితి లేకుండా 4లక్షల 31వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా అందిచ‌నున్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు.

Related posts