telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం కేసీఆర్‌ను బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర పడింది !

భద్రాచలం MLA పొదేం వీరయ్య సీఎం కేసీఆర్‌ పై ఫైర్‌ అయ్యారు. ముక్కోటి ఉత్సవాలలో ప్రోటోకాల్ పాటించలేదంటూ మండిపడ్డారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి ఉత్తర ద్వారాదర్శనం నిర్వహించారని…సిగ్గులేని ప్రభుత్వం సిగ్గుమాలిన పనులు చేస్తుందన్నారు. సామాన్య భక్తులు చేసిన పాపం ఏంటని… భద్రాచలం పరిసర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు నిరాస్యతో వెనుదిరిగారని తెలిపారు.  నేను 100 కోట్లు ఇస్తా అన్న కేసీఆర్ గారు భద్రాచలం వైపు ముఖం చూపించలేదని… స్థానిక MLA అయిన తనకు ప్రోటోకాల్ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేవస్థానం, రెవిన్యూ, పోలీస్ శాఖలు విఫలమయ్యాయని.. చంద్రబాబు,YSR హాయాంలో ప్రతి దానికీ జావాబుదారి తనం ఉండేదని పేర్కొన్నారు. నేను MLA గా మూడుసార్లు ఎన్నికయ్యను ఏ ఏడాదికూడా ఈ విధంగా ఉత్సవాలు నిర్వహించలేదని… నన్ను పిలిచి అవమానించారని ఆగ్రహించారు. ప్రోటోకాల్ వ్యవహారం పై అసెంబ్లీ, ప్రివిలైజ్ కమిటీకి కంప్లైంట్ చేస్తున్నానని.. ఈ అవమానం నా ఒక్కడికే కాదు భద్రాద్రి ప్రజలకు కూడా జరిగినట్టేనన్నారు. స్థానిక ప్రజలు లోపలికి అనుమతించకపోవడం, ఆ ప్రాంతాన్ని తమ చేతులలోకి తీసుకొని ఇష్ట రాజ్యాంగ వ్యవహరించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలి ఆ రాముడే చూసుకుంటాడని… ఆయనను బంగాళాఖాతంలో కలిపే రోజు ముందు ఉందని స్పష్టం చేశారు.

 

Related posts