telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని ఫైర్

kodali nani ycp

తిరుమల డిక్లరేషన్ పై సంతకం పెట్టి, సతీసమేతంగా శ్రీవారిని సీఎం జగన్ దర్శించుకోవాలన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై  ఏపీ మంత్రి కొడాలి నానిమండిపడ్డారు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని  విమర్శించారు.

రాష్ట్రంలో అత్యధిక ఓట్లను సాధించిన జగన్ కు సలహా ఇచ్చే స్థాయి బీజేపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. తిరుమలలో డిక్లరేషన్ ను తొలగించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని నాని చెప్పారు.ప్రధాని మోదీని భార్యను తీసుకెళ్లి రామాలయంలో పూజలు చేయమని చెప్పండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైసీపీలో ఎవరిని ఉంచాలి? ఎవరిని తొలగించాలి? అనే విషయాలను జగన్ కు బీజేపీ నేతలు చెప్పాల్సిన అవసరమేముందని నాని ప్రశ్నించారు. ఎవరి పార్టీ వ్యవహారాలు వారు చూసుకుంటే మంచిదని అన్నారు. సోము వీర్రాజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని ఆరోపించారు.

Related posts