telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

భారత్-ఇంగ్లాండ్ : మొదటి సెషన్ పూర్తి…

చెన్నై వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య నేడు రెండో టెస్ట్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు మొదట్లోనే షాక్ తగ్గిలింది. మ్యాచ్ రెండో ఓవర్లోనే వెనుదిరిగిన ఓపెనర్ గిల్ డక్ ఔట్ గా వెనుదిరిగాడు. దాంతో ఒక పరుగు చేయకుండానే వికెట్ కోల్పోయిన టీం ఇండియా. అయితే గిల్ ఔట్ కావడంతో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన పుజారాతో కలిసి మరో ఓపెనర్ రోహిత్ శర్మ మంచి భాగసామ్యం నెలకొల్పాడు. కానీ 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పుజారా ఔట్ అయ్యాడు. దాంతో బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ కూడా డక్ ఔట్ గా వెనుదిరగడంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కానీ ఆ తర్వాత రోహిత్ (80) రహానే(5) మరో వికెట్ పడకుండా జాగ్రత్త ఆడటంతో టీం ఇండియా 106/3 తో మొదటి సెషన్ ముగించింది. అయితే భారత జట్టుకు ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కు వెళ్లాలంటే భారత తప్పకుండ ఈ మ్యాచ్ లో గెలిచి తీరాలి. లేదంటే ఆసీస్ కు అవకాశాలు మెరుగుపడతాయి. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.

Related posts