telugu navyamedia
క్రీడలు

డక్‌వర్త్‌-లూయిస్‌ సృష్టికర్త కన్నుమూత

luice

క్రికెట్‌లో ఎంతో పాపులర్‌ అయిన డక్‌వర్త్‌-లూయిస్‌ విధాన సృష్టికర్తల్లో ఒకరైన టోనీ లూయిస్‌ (78) మృతి చెందాడు.1997లో ఫ్రాంక్ డక్‌వర్త్‌తో కలసి టోనీ లూయిస్.. అంతర్జాతీయ క్రికెట్‌కు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని పరిచయం చేశారు. కాగా.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టోనీ లూయిస్ కన్నుమూశారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతికి అంతర్జాతీయ క్రికెట్ మండలి 1999లో ఆమోద ముద్ర వేసింది. అయితే ఈ పద్ధతి మాత్రం 2004 నుంచి అందుబాటులోకి వచ్చింది.లూయిస్‌ మృతికి ఐసీసీ సంతాపం తెలిపింది. వర్షం కారణంగా మ్యాచ్‌లు సగంలో ఆగిపోతే డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని ఉపయోగించి విజేతను ప్రకటిస్తారు.

Related posts