telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ వార్తలు సామాజిక

కన్నీరు కారుస్తున్న శవాలు…

కర్మ పెట్టి, పున్నామ నరకం నుండి తప్పిస్తాడనుకునే తల్లిదండ్రులకు, ఎన్ని కోట్లు యిచ్చినా,

ఎంత ఆస్తులు పంచినా,

చివరి చూపుకి నోచుకోలేక, అనాధ శవమై,

చితికి నిప్పంటించే కాటికాపరే పెద్దకొడుకైన వైభోగం..!!

ప్రతీ శవం కన్నీరు కారుస్తూ చెప్పిన కరోనా వైభవం..!!

ఆగని మృత్యువులతో, ఆగని మారణ

హోమాలతో ఉలిక్కిపడిన స్మశానాలు..!!

వెన్నులో వణుకు పుట్టించే వార్తలు..!!

బెడ్లు ఖాళీ లేక, ఆస్పత్రి బయట

విగత జీవులై పడి ఉన్న శవాలు..!!

కంటి ముందు జరిగే శవాలపై బేరాలు..!!

ఇంతా జరుగుతున్నా, ఆగని మృత్యు ఘంటికలు..!!

బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కరోనాకు కవల పిల్లలు..!! సాంకేతిక పరిజ్ఞానం పేరుతో తెచ్చుకున్న ముప్పుతిప్పలు.!! కాలు బయట పెట్టాలంటే శ్మశానానికే పోతామో,

కొంత కాలం ఉంటామో తెలియని జనాలు..!!

ఉప్పెన, సునామి, భూకంపాలకు ఎన్నోరెట్లు

కరోనా మోగిస్తున్న డేంజర్ బెల్స్ ప్రపంచ

చరిత్రలో లిఖించదగిన సువర్ణాక్షరాలు..!!

ఇప్పటికైనా కరోనా మోగిస్తున్న

డేంజర్ బెల్స్ తో కళ్ళు తెరుద్దాం..!!

 

Related posts