దాదాపుగా ఏడాది నుండో చేని నుండి వచ్చిన కరోనా ప్రయోఅంచని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే భారత్ లో కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 16 నుంచి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఈరోజు నుంచి రెండోదశ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. తొలిదశలో టీకా తీసుకున్న వారు, రెండో దశ టీకాను తీసుకోబోతున్నారు. మొదటి దశలో ఏ టీకా తీసుకున్నారో రెండోదశలో కూడా అదే టీకాను తీసుకోవాల్సి ఉన్నది. ఆరోగ్యసిబ్బందికి, కరోనా వారియర్స్ కు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యాక, దేశంలో సాధారణ ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తారు. తెలంగాణలో మార్చి రెండోవారం నుంచి సాధారణ ప్రజలకు వ్యాక్సిన్ ను అందించనున్నట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ తెలియజేసింది. ముందుగా 50 ఏళ్ళు పైబడిన వారికి వ్యాక్సిన్ ను అందించనున్నారు. ఆ తరువాత మిగతా వారికి వ్యాక్సిన్ అందిస్తారు. అయితే ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ పంపిణి కొనసాగుతున్న కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. కడలి మరి అందరికి వ్యాక్సిన్ ఇచ్చిన తరువాతనైనా కేసులు తగ్గుతాయా… లేదా అనేది.
previous post
next post