telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌ తిట్లపై పవన్‌ సంచలన వ్యాఖ్యలు!

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తెలంగాణ సీఎం కేసీఆర్ పై  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రులను తిట్టారు.. ఇక వదిలేయండని పవన్‌ వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో గురువారం జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్‌ మీరు ఉద్యమానికి నాయకత్వం వహించారు. తక్కువ హింసతోనే రాష్ట్రాన్ని సాధించారు. మీపై గౌరవం ఉంది. మీ గొడవల వల్ల ప్రజలను శిక్షించకండని విజ్ఞప్తి చేశారు.

1996లో బీజేపీ ‘ఒక ఓటు, రెండు రాష్ట్రాలు’ అనే తీర్మానం చేసి తెలుగు ప్రజలను రెండు ముక్కలు చేసిందన్నారు. ఆ బాధ ఉన్నప్పటికీ… మోదీ ప్రధాని కావాలని తాను కోరుకున్నానని తెలిపారు. కానీ పార్లమెంటుసాక్షిగా హామీలు నెరవేర్చలదని విమర్శించారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఒకసారి కాంగ్రెస్‌ దెబ్బకొట్టిందని… ఇప్పుడు బీజేపీ ఆ పని చేస్తోందని ధ్వజమెత్తారు.బీజేపీతోపాటు టీఆర్‌ఎస్‌ నేతలు కేసీఆర్‌, హరీశ్‌లతో తనకు జగన్‌కంటే ఎక్కువ సాన్నిహిత్యం ఉందని.. అయితే, రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్లతో విభేదించానని తెలిపారు.

చంద్రబాబు పోటీ చేయొచ్చు. జగన్‌ పోటీ చేయొచ్చు. కానీ.. కేసీఆర్‌ను ఎందుకు తెస్తారని పవన్ ప్రశించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టిన వ్యక్తులకు అండగా ఉండడం మంచిది కాదని పవన్ వ్యాఖ్యానించారు. తనకు చంద్రబాబు, జగన్‌తో వ్యక్తిగత విభేదాలేవీ లేవన్నారు. ప్రజలకు వాళ్లవల్ల సంపూర్ణ న్యాయం జరగనందుకే మాట్లాడానని తెలిపారు. ‘‘నేను జగన్‌ విధానాలను విమర్శిస్తే ఆయన నన్ను వ్యక్తిగతంగా విమర్శించారని దుయ్యబట్టారు.

Related posts