telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత బాధ కలిగించింది: జగన్

*మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల సీఎం జగన్‌ దిగ్భ్రాంతి
*తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువనాయకుడు గౌతమ్‌రెడ్డి: సీఎం
*మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేను: సీఎం జగన్‌

ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు.ఆయ‌న హఠాన్మరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గౌతమ్‌రెడ్డి తనకు తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువ నాయకుడుగా పేర్కొన్నారు. మంత్రి వర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత బాధను కలిగించిదని సీఎం జగన్‌ అన్నారు. భారమైన హృదయంతో ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని జగన్ తెలియజేశారు.

కాగా.. మంత్రి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు విజ‌యవాడ నుంచి సీఎం జగన్ హైదరాబాద్ కు బయల్దేరారు.

Related posts