telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఏ ఆస్పత్రిలో చూసినా మందుల కొరత: ఉత్తమ్

uttam congress mp

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ పెద్దమొత్తంలో కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాసుపత్రులను నాయకులు గాలికొదిలేశారని అన్నారు.

రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలో చూసినా మందుల కొరతే కనిపిస్తోందన్నారు. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీలను భర్తీ చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వెల్లడించారు. నాగార్జునసాగర్ కింద సాగయ్యే 30 లక్షల ఎకరాలను బీడు భూములుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు.

Related posts