హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా వార్డును శివార్లకు తరలించాలని డిమాండ్ చేస్తున్న జూనియర్ డాక్టర్లకు తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ చురకలంటించారు. శనివారం ఆస్పత్రిలో తిరిగిన మంత్రి కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న యువకుడిని పరామర్శించారు.
అనంతరం జూనియర్ డాక్టర్లతో మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన వారే ఇలా ఆందోళన చెందితే ఎలా అంటూ ప్రశ్నించారు. ఐసోలేషన్ వార్డు దగ్గర ఉండటం వల్ల ఎవరికీ వైరస్ సోకదని, మంత్రిగా తానే వచ్చినప్పుడు డాక్టర్లుగా భయపడటంలో అర్థం లేదని జూడాలను మంత్రి మందలించారు.
తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ తప్పు చేసింది…