telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

సజ్జా గింజలతో .. పలు ప్రయోజనాలు.. రోజు చిటికెడు..

health benefits of sabja or basil seeds

చియా సీడ్స్ లేదా స‌బ్జా గింజ‌లు ఉండటానికి చాలా చిన్న పరిమాణంలో ఉన్నా కూడా అవి చేసే మేలు అంతా ఇంతా కాదు. కేవ‌లం 3 గ్రాముల స‌బ్జా గింజ‌ల‌ను తీసుకుని వాటిని నీటిలో వేయాలి. 10 నిమిషాల‌కు అవి జెల్‌లా మారుతాయి. అప్పుడు వాటిని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. లేదంటే ఫ్రూట్ స‌లాడ్స్, ప‌ళ్ల ర‌సాలు, మ‌జ్జిగ వంటి వాటితో క‌లిపి తిన‌వ‌చ్చు. ఎలా తిన్నా కూడా స‌బ్జా గింజ‌ల ద్వారా మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అధిక బరువు తగ్గడానికి ఇవి చక్కగా ఉపకరిస్తాయి. ఏమంటే, ఇవి కొద్దిగా తింటే కడుపు నిండినట్టే ఉంటుంది. అలాగే ఆకలి కూడా త్వరగా వేయదు. ఈ రెండు బరువు తగ్గాలనుకునే వారికి చాలా అవసరం.
  • జీర్ణసంబంధిత వ్యాధులకు కూడా ఇవి చక్కగా పనిచేస్తాయి. ఇవి రోజు తీసుకోవడం వలన తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. కారణం దీనిలో ఉండే ఫైబర్. తద్వారా మలబద్దకం లాంటి సమస్యలు కూడా దరిచేరవు. అలాగే జీర్ణం కాకపోవటం వలన ఎదురయ్యే సమస్యలు గ్యాస్, అసిడిటీ కూడా తలెత్తవు.
  • గాయాలకు ఈ గింజల పొడిని రాసుకుంటే ఇన్ఫెక్షన్ లాంటివి రాకపోవటమే కాకుండా త్వరగా తగ్గుముఖం పడతాయి.
  • ఈ గింజలను నీళ్లలో నానబెట్టి తలనొప్పిగా ఉన్నప్పుడు తీసుకుంటే, ఇట్టే ఆ సమస్య నుండి బయటపడవచ్చు. మైగ్రేన్ వంటి తీవ్రమైన సమస్య ఉన్నవారు కూడా ఈ చిట్కా పాటించి, మంచి ఫలితాలు పొందవచ్చు.
  • రక్తాన్ని శుద్ధి చేసేందుకు కూడా ఈ గింజలు చక్కగా ఉపయోగపడతాయి. అలాగే రక్తసరఫరా చక్కగా జరుగుతుంది, బీపీ కూడా అదుపులో ఉండేందుకు సహాయపడుతుంది.
  • తరచూ వచ్చే దగ్గు, జలుబు లాంటి వాటికి కూడా వీటితో సరిపోతాయి. అల్లం, నిమ్మరసం కలిపిన నీటిలో కొంచం ఈ గింజలు కూడా వేసుకొని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.
  • రోజు ఉదయాన్నే ఈ గింజలను నీటిలో వేసుకొని తాగితే మంచి శక్తి లభించి, రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. ఎదిగే పిల్లలకు ఇలా ఇస్తుంటే, నీరసం వారి దరిచేరకుండా రోజంతా ఆహ్లాదంగా ఉంటారు. క్రీడాకారులు, అధిక శ్రమ చేసేవారికి ఈ చిట్కా తిరుగులేనిది.
  • వీటిలో ఉంటె యాంటీ బయోటిక్, వైరల్, ఫంగల్ వంటి గుణాలు అలర్జీ, ఇన్ఫెక్షన్ ల వంటి సమస్యలను దరిచేరనియ్యవు.
  • ఒత్తిడి దరిచేరకుండా ఉండాలంటే రోజు నీటిలో వేసిన ఈ గింజలు తీసుకుంటే చక్కటి ప్రయోజనం కనపడుతుంది.

Related posts