telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ పోలీసు శాఖ ఉచిత భోజన సదుపాయం..

right food for asthma patients

మన దేశంలో కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న.. కేసుల తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖ  కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు  తెలంగాణ పోలీసు శాఖ ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించనుంది. ఇంట్లో చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించనుంది. సత్యసాయి సేవా సంస్థ, ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గి, బిగ్‌ బాస్కెట్‌, హోప్‌ సంస్థలతో కలిసి ‘సేవా భోజనం’ పేరిట పథకాన్ని ప్రారంభించారు. భోజనం అవసరమైన వారు ఉదయం ఏడు గంటల్లోగా 77996-16163 వాట్సాప్‌ నంబర్‌ను సంప్రదించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న పిల్లలు, వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పోలీసు శాఖ తెలిపింది. అయితే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

Related posts