నిర్మాతలకు, నిర్మాణ సంస్థలకు స్పేస్ ఎక్స్ స్టార్ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమాను విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ చేయడమే కాకుండా దాన్ని కోట్లాది మంది డౌన్ లోడ్ చేసుకునేలా ఇంటర్నెట్ లో కొందరు పోస్ట్ చేస్తున్నారు. ఇలా అనధికారికంగా సినిమాలను డౌన్ లోడ్ చేసుకోవాలనుకునే వారికి స్పేస్ ఎక్స్ స్టార్ లింక్ ద్వారా చెక్ పెట్టబోతున్నారు శాస్త్రవేత్తలు. ఎవరైనా టొరంటో నుండి లేదా ఏదైనా ఇతర సైట్స్ నుండి పర్మిషన్ లేకుండా చిత్రాలను డౌన్ లోడ్ చేయాలని ప్రయత్నిస్తే మొదట ఆ సంస్థకు హెచ్చరికలు జారీ చేయబడతాయి. అవతలి వారి స్పందన బట్టి ఆ కంటెంట్ ఓనర్ కూ స్పేస్ ఎక్స్ ద్వారా ఈ విషయమై సమాచారం వెళుతుంది. పర్యవసానంగా చట్టపరమైన చర్యలను సదరు పైరసీ దారుడు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రయోగం సక్సెస్ అయ్యిందని, చాలామంది పైరసీ దారులకు నోటీసులు వెళ్ళాయని తెలుస్తోంది. భూమికి సమీప కక్ష్యలలో నిలిచే ఉపగ్రహాల సమూహం ద్వారా స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్ట్ కావడంతో వీలైనంత త్వరగా పైరసీకి సంబంధించిన సమాచారం లక్ష్యమౌతుంది. దానితో పైరసీ వీడియోలను ఎక్కువ మంది డౌన్ లోడ్ చేయకుండా అరికట్టవచ్చు. అలానే… డౌన్ లోడర్స్ మీద ఇంటర్నెట్ సంస్థలు చర్యలు తీసుకోవడం అంటూ జరిగితే… పైరసీ ఏదో ఒక మేర ఆగిపోతుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.
previous post
next post