telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఉప్పెన గురించి పవన్ ఎమ్మనడంటే…?

మెగా కుటుంబం నుంచి రానున్న నూతన హీరో వైష్ణవ్ తేజ్. తెలుగు చిత్ర పరిశ్రమలోకి అరంగేట్రం ఇచ్చేందుకు అన్ని విధాల సన్నద్దంగా ఉన్న వైష్ణవ్ తన తొలిసినిమాను కూడా చిత్రించాడు. ఈ సినిమాకు ఉప్పెన అనే పేరు పెట్టారు. ఈ సినిమా నిజానికి గతేడాది ఏప్పిల్‌లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా సినిమా ఆలస్యం అయ్యి రేపు విడుదల కానుంది. ఇది వైష్ణవ్ తొలి సినిమానే అయినప్పటికీ దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అత్త తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి ఈ చిత్రం ట్రైలర్ ను, ప్రమోషనల్ కంటెంట్ ను చిత్ర కథానాయకుడు వైష్ణవ్ తేజ్, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత రవి శంకర్ చూపించారు.  పవన్ ఈ సినిమాపై స్పందిస్తూ.. వైష్ణవ్.. ‘జానీ’ చిత్రంలో బాల నటుడిగా.. హీరో చిన్నప్పటి పాత్రను పోషించాడు. ఇప్పుడు హీరోగా ఎదిగాడు. ‘ఉప్పెన’లో వైష్ణవ్ చాలా ఆకట్టుకొనేలా ఉన్నాడు. ఈ సినిమా కూడా ‘రంగస్థలం’, ‘దంగల్’ ‘లాంటి చిత్రాల్లో ఉండే ఎమోషన్స్ ఎక్కువ కాలం మనకు గుర్తుండిపోతాయి అని పేర్కొన్నాడు. అయితే రేపు విడుదల అవుతున్న ఈ సినిమా అభిమానుల నాచనలను ఏ మేర అందుకుంటుందో చూడాలి.

Related posts