telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కేరళలో రెడ్ అలర్ట్.. భారీ వర్ష సూచన..

red alert in kerala on huge rains

దేశంలోని పలుప్రాంతాలలో వర్షాల తాకిడికి ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. తీరప్రాంతాల వారి బాధలు అంతాఇంతా కాదు. ఉత్తరభారతం అంతా నీటిమయం కావటం నిన్నటి వరకు చూస్తూనే ఉన్నాం. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. లక్షల మంది నిర్వాసితులు కాగా, కనీస సౌకర్యాలు కూడా అందక ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి.

గత వరదల చేదు జ్ఞాపకాలు ఇంకా కేరళీయులను వెంటాడుతున్న నేపథ్యంలో, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ సంస్థ (ఐఎండీ) హెచ్చరించిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ విధించారు. మరికొన్ని ప్రాంతాల్లో యెల్లో, ఆరెంజ్ అలర్ట్ విధించారు. కొన్నిరోజులుగా స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Related posts