telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన… తెలుగులో నిఖిలేశ్వర్ కు పురస్కారం

సాహిత్య రంగంలో విశేష రచనలకు ఏటా అందించే “కేంద్ర సాహిత్య అకాడమీ” అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020 ఏడాదికి గానూ మొత్తం 20 భాషల్లో రచనలను ఈ జాతీయ అవార్డులకు ఎంపిక చేసింది. 18 భాషల్లో సాహిత్య అకాడమీ “యువ పురస్కారాలు”, 20 భాషల్లో సాహిత్య అకాడమి పురస్కారాలను ప్రకటించింది కేంద్రం. ఈ జాబితాలో పద్య కవిత్వంలో 7, నవలలకు 4, చిన్న కథలకు 5, నాటకాలకు 2 సాహిత్య అకాడమీ పురస్కారాలు వచ్చాయి. తెలుగులో నిఖిలేశ్వర్ రచించిన “అగ్నిశ్వాస” కవిత్వానికి “కేంద్ర సాహిత్య అకాడమీ” అవార్డు వచ్చింది. విజేతలకు లక్ష రూపాయల నగదు, తామ్ర పత్రం అందజేయనుంది కేంద్ర సాహిత్య అకాడమీ. తెలుగు భాష నుంచి మానస ఎండ్లూరి రచించిన షార్ట్ స్టోరి “మిలింద” ఎంపికైంది. యువ పురస్కార గ్రహితలకు 50 వేల నగదు బహుమానం, తామ్ర పత్రం అందజేయనుంది కేంద్ర సాహిత్య అకాడమీ.

Related posts