telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రేమ కావాలి కానీ పిల్లలొద్దు… హాట్ బాంబ్ వ్యాఖ్యలు

Mallika-Sherawath

బాలీవుడ్ లో శృంగార తారగా వెలుగొందిన నటి మల్లికా శరావత్. తన అందాల ఆరబోతతో ఎందరో కుర్రాళ్లకు మతులు పోగొట్టి, సినిమాలకు కాసుల వర్షం కురిపించిన మల్లికా శరావత్ కు ఇటీవల సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. మల్లికా శరావత్ నటించిన “మర్డర్” చిత్రం అప్పట్లో బాలీవుడ్ లో ఓ సంచలనం. ఆ చిత్రంలో నగ్న సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్ లో మల్లిక రెచ్చిపోయింది. ఆమె కోసమే ప్రేక్షకులు ఆ సినిమాకు క్యూ కట్టారంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్‌లో పలు సంచలనాత్మక చిత్రాలతోపాటు, హాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది. ఆ తర్వాత ఫ్రాన్స్‌కు చెందిన వ్యాపారవేత్త సిరిల్‌తో కొంతకాలం డేటింగ్ చేసింది. ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పేసి భారత్‌కు తిరిగి వచ్చేసింది. ప్రస్తుతం మల్లికా నటిస్తున్న చిత్రం “బూ..సబ్కి ఫేటేగి”. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి మల్లిక మాట్లాడింది. `”ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నాను. నేనే కాదు.. చాలా మంది సెలబ్రిటీలు సింగిల్‌గానే ఉన్నారు. నాకు మళ్లీ ప్రేమలో పడాలని ఉంది. అయితే తల్లినయ్యేందుకు సిద్ధంగా లేను. మాతృత్వం అనేది చాలా పెద్ద బాధ్యత. ఎప్పుడూ పిల్లల గురించే ఆలోచించాలి. నాకు అలాంటి బాధ్యత వద్దు. నేను ఇలాగే సంతోషంగా ఉంటాను” అని మల్లిక చెప్పింది.

Related posts