telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమెజాన్ లో ఆప్కో వస్త్రాల విక్రయం: మంత్రి గౌతమ్ రెడ్డి

gaoutham reddy ycp

ఆప్కో ద్వారా విక్రయించే చేనేత వస్త్రాలను ఇకపై ఆన్ లైన్ లోనూ విక్రయించనున్నారు. ఈ మేరకు ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఇక నుంచి ఆప్కో వస్త్రాలు ప్రపంచమంతటా అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్ లోనూ ఆప్కో వస్త్రాలను కొనుగోలు చేయవచ్చని అన్నారు. చేనేత బ్రాండ్ విలువను పెంచేందుకు అమెజాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని మంత్రి వివరించారు. ఆప్కో బ్రాండ్ ద్వారా మన నేతన్నలకు మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు.

Related posts