మెట్రోలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. రైళ్ల కంపార్ట్‌మెంట్‌లోని పై బాగం ఊడి ప్రయాణికులపై పడింది. అయితే ఈ సంఘటన ఎల్బీనగర్ మియాపూర్ మార్గంలో ఉన్న ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ప్రాంతంలో జరుగినట్టు తెలుస్తోంది. అయితే దీని వల్ల ఎలాంటీ ప్రమాదం జరగలేదు. అయితే కంపార్ట్‌మెంట్ పై భాగం ఊడిపోడంతో రైలు ప్రయాణికలు ఆందోళన చెందారు. ఊడిపోయిన భాగాన్నితిరిగి పెట్టేందుకు మెట్రో అధికారులు ప్రయత్నాలు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి మెట్రో అధికారుల వివరణ ఇవ్వాల్సి ఉంది.
కొద్ది రోజుల క్రితం అమిర్‌పేట్‌లోని మెట్రో స్టేషన్‌లో నిర్మాణం కూలి మహిళ మృతి చెందడంతో మెట్రో ప్రయాణంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో నిర్మాణపరంగా పలు స్టేషన్లలలో లోపాలు గుర్తించారు. ప్రస్తుతం మెట్రో నిర్మాణంలో కాకుండా ఏకంగా మెట్రో రైల్ నిర్మాణంలోని భాగాలు ఊడిపడడం మరింత ఆందోళన కల్గిస్తోంది. అత్యంత నమ్మకంగా ప్రయాణికులను గమ్యానికి చేర్చాల్సిన మెట్రో ఇలా ప్రమాదాలకు నిలయాలు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.
భయంతోనే చంద్రబాబు సైలెంట్: విజయసాయిరెడ్డి