telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భారత్, చైనాలు .. సుంకాలతోనే బ్రతికేస్తున్నాయి.. : ట్రంప్

trump in america president election race

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌, చైనాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణించవద్దని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)ను కోరారు. ఎందుకంటే ఆ దేశాలు అమెరికాపై సుంకాలు పెంచి ముందుకెళ్తున్నాయని లేఖ రాశారు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఆ రెండు దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా గుర్తించినప్పటి నుంచి ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయని అన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఉన్నతమైంది. చైనా, భారత్‌లను ఆ సంస్థ అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణిస్తోంది. దీనికి సంబంధించి మేం ఆ సంస్థకు లేఖ రాశాం. మేమైతే చైనాను, భారత్‌ను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణించబోం. ఎందుకంటే ఆ దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచి ఎదుగుతున్నాయని విలేకరులతో అన్నారు.

చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం నెలకొన్న విషయం తెలిసిందే. తొలుత చైనా వస్తువులపై ట్రంప్‌ ప్రభుత్వం ఆర్థికపరమైన ఆంక్షలు విధించినప్పటి నుంచి ఈ యుద్ధం మొదలైంది. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలను పెంచింది. మరోవైపు భారత్‌-అమెరికా త్వరలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాయని ఇటీవల సంయుక్తంగా ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీ హ్యూస్టన్‌ పర్యటన సందర్భంగా ట్రంప్‌తో ఈ విషయంపై భేటీ అయిన విషయం తెలిసిందే.

Related posts