telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

డబ్ల్యూహెచ్ఓపై ట్రంప్ నిర్ణయం ప్రమాదకరం: బిల్ గేట్స్

Bill Gates speaks during an interview with Reuters in London

కరోనా వైరస్ మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వ్యవహరించిన తీరును ప్రశ్నిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ సంస్థకు నిధులను ఆపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్పందించారు. యావత్ ప్రపంచానికి ఎప్పుడూ లేనంతగా ప్రస్తుత పరిస్థితుల్లోనే డబ్ల్యూహెచ్ఓ అవసరం ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న సమయంలో డబ్ల్యూహెచ్ఓకు నిధులను ఆపివేయడం ప్రమాదకరమైన నిర్ణయమని చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ చేస్తున్న కృషి వల్లే కరోనా విస్తరణ కంట్రోలైందని ఆ సంస్థ పనిచేయడాన్ని ఆపేస్తే… మరే ఇతర సంస్థ దాని స్థానాన్ని భర్తీ చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

Related posts