telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సంగారెడ్డి కలెక్టర్‌ను ప్రశంసించిన కేసీఆర్

సంగారెడ్డి కలెక్టర్‌ హన్మంతరావును సీఎం కేసీఆర్ ప్రశంసించారు. అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలు నిర్మించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నూటికి నూరుశాతం నెరవేర్చారని కలెక్టర్ హన్మంతరావును ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కొడియాడారు. మంత్రులు, కలెక్టర్లతో కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 647 గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించి, వాటిని అందుబాటులోకి తెచ్చారని సీఎం తెలిపారు. సంగారెడ్డి జిల్లాను ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లాల్లో కూడా వందకు వందశాతం వైకుంఠధామాలు నిర్మించాలని సీఎం కోరారు. అటు రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతున్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ కేటాయింపు, డంప్ యార్డు, వైకుంఠధామం, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతోపాటు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఇవాళ ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో 84 పంచాయతీలకు మాత్రమే సొంత ట్రాక్టర్లు ఉండేవి.. నేడు 12,765 పంచాయతీలకు 12,681 ట్యాంకర్లు సమకూర్చామని తెలిపారు.

Related posts