telugu navyamedia
సినిమా వార్తలు

వైరల్ : నెటిజన్ కు న్యూడ్ ఫోటోలు పంపిన చిన్మయి

Chinmayi-Sripada

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మీటూ ఉద్యమం నేపథ్యంలో ప్రముఖ రచయిత వైరముత్తుపై వ్యాఖ్యలు చేయడం, అవి సంచలనంగా మారడం తెలిసిన విషయమే. చిత్ర పరిశ్రమ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నా చిన్మయి మాత్రం వాటిని ఎదుర్కొంటూ ఒంటరిగా తన పోరాటం కొనసాగిస్తోంది. తాజాగా చిన్మయి చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో చిన్మయిని ఓ వ్యక్తి న్యూడ్ ఫోటోలు పంపాలని కోరగా… అతడి ప్రశ్నకు చిన్మయి ఏమాత్రం ఆగ్రహం వక్తం చేయకుండా అదిరిపోయే సమాధానం ఇచ్చింది. అతడు అడిగినట్లుగానే నాకు నచ్చిన న్యూడ్ పిక్స్ ఇవే అంటూ చిన్మయి లిప్ స్టిక్ ఫోటోలు షేర్ చేసింది. కానీ అవి అతడు కోరుకున్న ఫోటోలు కాదు. హ్యూమన్ స్కిన్ కలర్ లో ఉండే కొన్ని లిప్ స్టిక్స్ ని న్యూడ్ లిప్ స్టిక్స్ అని పిలుస్తారు. ఆ ఫోటోలను చిన్మయి అతడికి షేర్ చేసింది. అతడితో చిన్మయి వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related posts