ప్రముఖ టాలీవుడ్ హీరో తరుణ్ తృుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నార్సింగి పరిధిలోని అల్కాపూర్‌లో తరుణ్ ప్రయాణిస్తున్న కారు మితిమీరిన వేగంతో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున జరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడంతో తరుణ్ కు పెద్దగా గాయాలు కాకుండా బయటపడినట్టు తెలుస్తోంది. కారు ప్రమాదం తరువాత, తరుణ్ స్వయంగా ఫోన్ లో మాట్లాడి, మరో కారును తెప్పించుకుని వెళ్లిపోయాడని యాక్సిడెంట్ ను చూసిన స్థానికులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. ఈ ప్రమాదంలో తరుణ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం తర్వాత ఆయన మరో కారులో వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు.