telugu navyamedia
సినిమా వార్తలు

గ్లామర్ క్వీన్ సెల్ఫీ… ఆంటీ అంటూ ట్రోలింగ్

Kareena-Kapoor

సోషల్ మీడియాలో హీరోయిన్స్ పోస్ట్ చేసిన ఫోటోలు… ముఖ్యంగా గ్లామర్ ఒలికించే ఫోటోలు నిమిషాల్లో వైరల్ అయిపోతుంటాయి. ఇటీవల కాలంలో సీనియర్ హీరోయిన్లు కూడా సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. అయితే ఈ ఫొటోల్లో హీరోయిన్లు అందంగా కన్పిస్తే ఓకే కానీ… ఏదైనా తేడా అన్పిస్తే మాత్రం ట్రోలింగ్ బారిన పడినట్లే. ఇప్పుడు అదే తరహాలో కరీనా కపూర్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో కరీనా వయసు ఎక్కువగా ఉన్నట్లు కనిపించడంతో కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఎండలో సెల్ఫీ దిగడంతో కరీనా మొహం ఊహించని విధంగా కనిపించింది. 38 ఏళ్ల కరీనా కపూర్ ఆంటీలా మారిందని అంటున్నారు. గతంలో అనేక రకాల ఫోటో షూట్స్ లో పాల్గొని గ్లామర్ గర్ల్ గా మెరిసిన కరీనా ఇప్పుడు ట్రోలింగ్ కి గురవ్వడం ఆమె ఫాలోవర్స్ ని కలవరపెడుతోంది.

Related posts