telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రేమికుల దినోత్సవం…సింగర్‌ సునీత ఎక్కడ ఉందో తెలుసా ?

సినిమా ఇండస్ట్రీలో రెండో పెళ్లి సర్వ సాధారణం. అయితే తాజాగా… సింగర్ సునీత కూడా కొత్త జీవితం ప్రారంభిస్తున్నానని, పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే
సింగర్‌ సునీత,‌ ప్రముఖ డిజిటల్ బిజినెస్‌మెన్ రామ్‌ వీరపనేనితో ఇటీవల వివాహం చేసుకుంది. వీళ్లిద్దరి వివాహం గత నెలలో జరగగా.. ఈ కార్యక్రమానికి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో అట్టహాసంగానే జరిగింది.  అయితే తాజాగా సునీత తన ఇంస్టాగ్రమ్‌లో ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటో చూస్తుంటే ఎక్కడికో వెకేషన్‌గా వెళ్లినట్లు అర్థం అవుతోంది. నేడు ప్రేమికుల రోజు సందర్భంగా సునీత వెకేషన్‌కు వెళ్లినట్లు అంటున్నారు. ఈ ఫోటోలో బ్యాక్‌గ్రౌండ్ చూసి సునీత మాల్దీవులకు వెళ్లారని నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. అయితే అసలు సునీత మాల్దీవులకు వెళ్లారా లేదా అనేది మాత్రం తెలీదు. మరి ఈ విషయంలో సునీత స్వయంగా క్లారీటీ ఇవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Related posts