telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నితిన్‌ 30 వ సినిమా అప్డేట్‌ వచ్చేసింది…

నితిన్ గత ఏడాది భీష్మ సినిమాతో కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అదే దూకుడు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నితిన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా చెక్. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌లుగా చేస్తున్నారు. ఈ సినిమాను యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా… తాజాగా మరో సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. ఈ సినిమా నితిన్ కెరీర్‌లో చేస్తున్న 30వ సినిమా. ఈ చిత్రాన్ని హిందీ అంధాధున్ సినిమా రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా, నభా నటేష్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మర్లపాక గాంధీ దర్శకత్వంలో ఎన్ సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూన్11 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా నితిన్ చేసిన చెక్ సినిమా ఫిబ్రవరి26, రంగ్ దే మార్చి 26న థియేటర్లలోకి రానున్నాయి. నాలుగు నెలల వ్యవధిలో నితిన్ వరుసగా మూడు సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించారు.

Related posts