telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఇవాళ్టి నుంచే 45 ఏళ్ళు పై బడిన వాళ్లకు వాక్సినేషన్

మన దేశంలో ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అందరూ క్రేజులు తగ్గుతాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే  మహారాష్ట్రలో లాక్ డౌన్ ను విధించాలని డిమాండ్ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో  దేశంలో నేటి నుంచి 45 ఏళ్ళు పై బడిన వాళ్లకు వాక్సినేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఇప్పటి వరకు దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ చాలా విజయవంతంగా కొనసాగుతోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా 80 లక్షల మంది 45 ఏళ్ళు పై బడిన వారు ఉన్నట్టు గుర్తించింది ఆరోగ్య శాఖ. ఇప్పటికే హెల్త్ కేర్ వర్కర్ లు, ఫ్రంట్ లైన్ వర్కర్ లు సహా 45 ఏళ్ళు పై బడిన వారిలో 10 లక్షల మందికి తొలి డోస్ వ్యాక్సిన్ పూర్తి అయింది. అటు కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో వాక్సినేషన్ ని వేగవంతం చేసింది తెలంగాణ ప్రభుత్వం. వ్యాక్సినేషన్‌ నేపథ్యంలో ఇవాళ ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి ఈటల సమీక్ష నిర్వహించనున్నారు.

Related posts