telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

అలర్ట్ : తెలంగాణకు మరో రెండు రోజులు ఊరుములతో కూడిన వర్షాలు

తెలంగాణకు మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటి నుంచి ఉన్న ఉత్తర- దక్షిణ ఉపరితల ఆవర్తనం, ఈ రోజు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ కేరళ వరకు సముద్ర మట్టానికి 0.9కిమి ఎత్తు వరకు కొనసాగుతుంది. ఈ రోజు (28వ తేదీ) తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, వడగండ్లు మరియు ఈదురగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడుతాయని పేర్కొంది వాతావరణ శాఖ. రేపు ఎల్లుండి (29,30వ తేదీలు) రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షములు ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

వాతావరణ~హెచ్చరికలు:-
తెలంగాణా రాష్ట్రంలో ఇవాళ ఉరుములు, మెరుపులు, వడగండ్లు మరియు ఈదురగాలులతో (గంటకి 30 నుండి 40కిమి వేగంతో ) కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడుతాయని.. రేపు, ఎల్లుండి (29,30వ తేదీలు) ఉరుములు, మెరుపులు మరియు ఈదురగాలులతో ( గంటకి 30 నుండి 40కిమి వేగంతో )కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షములు (ఉత్తర, తూర్పు, దక్షిణ, సెంట్రల్ జిల్లాలలో) ఒకటి, రెండు ప్రదేశములలో పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Related posts