telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

జనసేన తరపున పోటీలో 70 ఏళ్ల బామ్మ…

70 ఏళ్ల వయస్సులోనూ ఓ వృద్ధ మహిళ  జనసేన అభ్యర్థిగా  పోటీ చేస్తూ ఓటర్లను ఆశ్చర్యపరుస్తోంది. తన ప్రత్యర్థులైన  వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థులకు ధీటుగా  ప్రచారం చేస్తూ ఔరా అనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీ  10వ  వార్డు జనరల్ మహిళ స్థానం నుంచి  జనసేన అభ్యర్థిగా ఆమె  ధీటైన పోటీ  ఇస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం  నేరుగా ఫోన్ చేసి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆమె గెలుపు కోసం కార్యకర్తలు సమాయత్తం చేశారు. 70 సంవత్సరాల వృద్ధురాలు ముత్యాల మణికుమారి ….వైఎస్సార్సీపీ, టీడీపీకి చెందిన ప్రత్యర్థులతో తలపడుతున్నారు. ఇక్కడ ముక్కోణపు పోటీ ఉంది…. ఈ వృద్ధురాలు పోటీపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించి ఆమె తమ జనసేన పార్టీకి స్ఫూర్తిగా నిలిచారని అభినందించారు. మహిళలకు, యువతకు స్ఫూర్తిగా నిలిచారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఇక పవన్ కళ్యాణ్ స్వయంగా మణి కుమారికి ఫోన్ చేసి మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థుల బెదిరింపులకు లొంగకుండా ధర్యంగా ప్రచారం నిర్వహిస్తున్నందుకు అభినందించారు. మీ వెనుక తానుంటానని అవసరం అయితే అమలాపురం వస్తానని పవన్ కళ్యాణ్ మణికుమారి కి తెలిపారు. ఎన్ని ఒత్తిడులు, బెదిరింపు కాల్స్ వచ్చినా తాను పోటీలో నిలబడ్డానని మణికుమారి పేర్కొన్నారు.

Related posts