telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

ఫోన్‌పే యాప్ లో .. చాట్ కూడా..

chat option in phonepe

ప్రస్తుత ప్రపంచం డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌ లను వాడటం అలవాటు చేసేసుకుంది. ఇలాంటివి చాలా రకాలు అందరికి అందుబాటులోకి వచ్చినప్పటికీ, వాటిలో ఫోన్‌పే యాప్ ముందు వరుసలో ఉంది. ఇండియాలో చాలా మంది చాటింగ్ కోసం వాట్సాప్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫోన్‌పేలో కొత్తగా చాట్ ఫీచర్‌ను ప్రారంభించింది. ఇప్పుడు ఇది తన ప్లాట్‌ఫామ్‌లో పేమెంట్స్ చేయడంతో పాటుగా చాటింగ్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నది. ఫోన్‌పేలో ఈ కొత్త ఫీచర్ ను జోడించడంతో యూజర్లు ఇప్పుడు మరొక ఇతర మెసేజింగ్ యాప్ అవసరం లేకుండా మీ యొక్క స్నేహితుల నుండి డబ్బును అభ్యర్థించవచ్చు మరియు చెల్లింపును చేయడంతో పాటుగా చాటింగ్ కూడా చేయవచ్చు.

ఫోన్‌పేలో చాట్ ఫీచర్‌ను జోడించడంతో వినియోగదారులు మరొకరితో చాటింగ్ చేస్తున్నపుడు వారి స్నేహితులకు ఇప్పుడు డబ్బును పంపడం చాలా సులభం చేస్తుంది. ఫోన్‌పే యాప్ లో యూజర్ యొక్క లావాదేవీలను చాట్ హిస్టరీలో చూపబడుతుంది కావున ఇది చాలా ఆకర్షణీయమైన అనుభవంగా ఉంటుంది అని కో-ఫౌండర్ మరియు CTO రాహుల్ చారి ఒక ప్రకటనలో తెలిపారు. ఫోన్‌పేలో కొత్తగా జోడించిన ఈ ఫీచర్ చాటింగ్ చరిత్రతో పాటు వారి ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి కూడా వినియోగదారులను అనుమతిస్తుంది.

రాబోయే వారాల్లో ఫోన్‌పేలో వాట్సాప్ గ్రూప్ చాట్ వంటి ఫీచర్లను కూడా తీసుకురానున్నట్లు రాహుల్ చారి తెలిపారు. ఇది చాట్‌ను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. గ్రూప్ చాట్ ఫీచర్ వినియోగదారులకు వారి యొక్క ప్లాట్‌ఫారమ్‌లోని స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి డబ్బును రిక్వెస్ట్ చేయడం / సేకరించడం వంటివి సులభం చేస్తుంది అని చారి తెలిపారు. ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ పరికరాల కోసం వారం క్రితం లాంచ్ చేసిన ఈ ఫీచర్ 185 మిలియన్ ఫోన్‌పే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిందని కంపెనీ తెలిపింది.

Related posts