telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బాలయ్య పై కొడాలి సెటైర్లు…

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. మంత్రి కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. నేను తిడితే అంత బూతులు తిట్టేవారు ఉండరన్న ఆయన.. నాకు ఒక పనికాదు.. ఎన్నో పనులు ఉంటాయన్నారు.. నేను చేస్తున్నది ప్రజాసేవే… విమర్శిస్తే ఊరుకోనని కౌంటర్ ఇచ్చిన ఆయన.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్‌గా రోగులకు సేవలు అందిస్తున్నాన్నారు. సినిమాల ద్వారా ప్రజలకు వినోదం అందిస్తున్నా. నాకు సంస్కారం ఉంది… నోరు పారేసుకుంటే.. ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చారు. అయితే, బాలయ్య వ్యాఖ్యలపై అదే స్థాయిలో స్పందించారు మంత్రి కొడాలి నాని… బాలకృష్ణ సినిమాలు చేసుకుంటారు.. పాటలకు మలేషియా, ఫైట్లకు హాంకాంగ్.. ఒక్కొక్క సీనుకు ఒక్కో చోటుకు వెళ్తుంటారు.. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు.. విదేశాలు తిరుగుతూ.. హైదరాబాద్‌లో ఉండేవాళ్లు ప్రజా సమస్యలపై మాట్లాడితే.. ప్రజలు నవ్వుకుంటారని కామెంట్ చేశారు. బాలయ్య మాట్లాడుతుంటే.. ఆయన పక్కనున్న నాయకులు, కార్యకర్తలు కూడా నవ్వుకుంటారు.. ఏ సీరియస్ అని ఆయన అంటుంటారు.. ఈయన చెప్పేది ఏది సీరియస్‌గా తీసుకోవాలో వారికి అర్థం కాని పరిస్థితి అని సెటైర్లు వేశారు. బాలకృష్న ఆటలో అరటి కాయలాంటి వాడు.. వాళ్ల బావ రాసిచ్చిన స్ర్కిప్టు చదువుతుంటారు.. ఆయన కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు కొడాలి నాని. చూడాలి మరి మళ్ళీ దీని పై బాలయ్య ఎలా స్పందిస్తారు అనేది.

Related posts