telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘సీతాయణం’ ఫస్ట్ లుక్‌

Sithayanam

కన్నడ సుప్రీం హీరో శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ‘సీతాయణం’ ఫస్ట్ లుక్‌ని తాజాగా విడుదల చేశారు. ప్రభాకర్ ఆరిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనహిత భూషణ్ కధానాయిక. కలర్ క్లౌడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం‌పై రోహన్ భరద్వాజ్ సమర్పణలో శ్రీమతి లలిత రాజ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడతో పాటు, తమిళంలో డబ్బింగ్ చేసి, అన్నీ ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.‘‘రెస్పెక్ట్ ఉమెన్ అన్న శీర్షికతో ప్రేమ, క్రైమ్, డ్రామాగా నడిచే చిత్రమిది. కథ కథనాలు నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటాయి.ఈ నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర నిర్మాత శ్రీమతి లలిత రాజ్యలక్ష్మి తెలిపారు. దర్శకుడు ప్రభాకర్ ఆరిపాక మాట్లాడుతూ.. ‘‘సీతాయణం, నేటి తరానికి నచ్చేలా, హృద్యమైన అంశాలు, సన్నివేశాలతో రాసుకున్న కథ. నిర్మాతల పూర్తి సహకారంతో, నటీనటుల అద్భుతమైన ప్రదర్శనతో అనుకున్నట్టుగా తెరకెక్కిస్తున్నాం. మా యంగ్ సుప్రీం హీరో అక్షిత్‌కి ఈ చిత్రం చాలా పెద్ద పెద్ద అవకాశాల్ని తెస్తుంది. హీరోయిన్ అనహిత చాలా బాగా చేసింది, వారిద్దరి జోడి చాలా బాగా కుదిరింది’’ అన్నారు.

Related posts