telugu navyamedia
సినిమా వార్తలు

ఓ మీడియా సంస్థ తప్పుడు ప్రచారం చేయిస్తోంది : కౌశల్

kaushal

బిగ్ బాస్ సీజన్-2 విన్నర్ కౌశల్ ఆయన పేరు మీదున్న ఆర్మీ వల్ల బాగా పాపులర్ అయ్యాడు. “కౌశల్ ఆర్మీ” కౌశల్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక్క మాటన్నా, గొడవ పడినా… వాళ్లను ఎలిమినేట్ చేసేవరకు నిద్రపోయేవారు కాదు. అలాంటి కౌశల్ ఆర్మీ ఇప్పుడు అకస్మాత్తుగా కౌశల్ ఆర్మీ స్వయంగా కౌశల్ పై నెగెటివ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కౌశల్ కు డబ్బు పిచ్చి ఉందని, డబ్బు లేకపోతే అభిమానులను కూడా పట్టించుకోడని, కౌశల్ ఎక్కడికి వెళ్లినా ఖర్చును మాత్రం కౌశల్ ఆర్మీనే భరించాల్సి వచ్చేదని, అభిమానులు తమ డబ్బులతోనే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేవారని చెప్పారు ఇమామ్. అంతేకాదు బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బును ఫౌండేషన్ కు వినియోగిస్తానని కౌశల్ చెప్పిన మాటలు అబద్ధమని, ఇలాంటి వ్యక్తి సొసైటీకి చాలా ప్రమాదకరమని మండిపడ్డారు.

వీరి వ్యాఖ్యలపై స్పందించాడు కౌశల్. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ తాజాగా మీడియా ముందుకు వచ్చి కొన్ని కామెంట్స్ చేశారు. మూడు నెలల క్రితం స్థాపించిన కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ గురించి అన్ని వివరాలు జెన్యూన్ గా ఉన్నాయని, ప్రతీ ఒక్క రూపాయికి లెక్క ఉందని, అవసరమనుకుంటే ఎవరైనా ఆడిటింగ్ చేసుకోవచ్చని, తాను డబ్బు మనిషిని కాదని, బిగ్ బాస్ గేమ్ ను ఎంతో కష్టపడి గెలిచిన తనపై ఓ మీడియా సంస్థ తప్పుడు ప్రచారం చేయిస్తుందని, ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని, తనతో సినిమా తీస్తామని చెప్పి మోసం చేశారని, తన కుటుంబాన్ని కూడా వదిలి కౌశల్ ఆర్మీ కోసమే పని చేస్తున్నానని తన ఆవేదనను వ్యక్తం చేశారు కౌశల్.

Related posts