telugu navyamedia
సినిమా వార్తలు

అత్యాచార ఆరోపణలతో మలయాళ డైరెక్టర్ అరెస్ట్‌..

అత్యాచార ఆరోపణలతో మలయాళ డైరెక్టర్‌ లీజు కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నివిన్‌ పాలీ హీరోగా నటిస్తున్న ‘పడవెట్టు’ సినిమాకు లిజు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలో చిత్రయూనిట్‌లోని ఓ యువతి డైరెక్టర్‌ తనను అత్యాచారం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు లిజు కృష్ణను కస్టడీలోకి తీసుకున్నారు.

2020 డిసెంబరు 20 నుంచి 2021 జూన్​ వరకు కొచ్చిలోని కక్కనాడ్​కు చెందిన సదరు మహిళపై.. లీజు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం కేరళలోని కన్నూర్‌లో ‘పడవెట్టు చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడి అరెస్ట్‌తో షూటింగ్‌ వాయిదా వేశారు.
పడవెట్టు సినిమాకు లిజు కృష్ణనే స్వయంగా కథ రాశాడు. ఇందులో నవీన్‌ పాలీతో పాటు మంజు వారియర్‌, అదితి బాలన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షమ్మీ తిలకన్‌, షైన్‌ టామ్‌ చికో, ఇంద్రన్స్‌, సుదీష్‌, విజయరాఘవన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సన్నీ వేన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Related posts