telugu navyamedia
సినిమా వార్తలు

గమనిక : “లక్ష్మీస్ ఎన్టీఆర్” అప్డేట్

Lakshmi's-NTR

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో దివంగత ఎన్టీఆర్ జీవితం ఆధారంగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” రూపొందుతున్న విషయం తెలిసిందే. సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్స్ తో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచారు. ఇటీవల “మహానాయకుడు” విడుదలకు ముందు “లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ట్రైలర్ ను విడుదల చేసి సంచలనం సృష్టించారు వర్మ. అయితే ఈ సినిమా విడుదల గురించి ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మార్చి 15న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయట. చిత్రంలో “లక్ష్మీపార్వతి” పాత్రలో యజ్ఞాశెట్టి నటిస్తోండగా, ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు నటిస్తున్నాడు. ఇక చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా వస్తున్న వార్తలపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ”లక్ష్మీస్ ఎన్టీఆర్ కి సంబంధించిన గమనిక : లక్ష్మీస్ ఎన్టీఆర్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో… ఏదో ఖరీదుకి కొనుక్కున్నారని వస్తున్న వార్తల్లో నిజాలు లేవు. ఎవరికి ఏ ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు జీవీ ఫిలిమ్స్, ఆర్జీవీ మరియు రాకేష్ రెడ్డిలు త్వరలో అప్డేట్ చేస్తారు” అంటూ వర్మ ట్వీట్ చేశారు.

Related posts