బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ “అర్జున్ రెడ్డి” హిందీ రీమేక్ తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం హిందీలోను మంచి విజయం సాధించింది. ఇప్పుడు నాని నటించిన జెర్సీ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నద్ధమయ్యాడు షాహిద్. జెర్సీ చిత్రం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కింది. కుటుంబ అనుబంధాలు, తండ్రీకొడుకుల అనురాగానికి క్రికెట్ నేపథ్యాన్ని మేళవించి భావోద్వేగభరితంగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. అర్జున్ పాత్రలో నాని చక్కని నట ప్రతిభని కనబరిచాడు. తన లక్ష్యానికి, ఉద్యోగానికి దూరమై కుటుంబ బాధ్యతలతో అర్జున్ సతమతమయ్యే సన్నివేశాలతో ప్రథమార్థాన్ని ఎమోషనల్‌గా నడిపించారు దర్శకుడు. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. జెర్సీ చిత్రాన్ని హిందీలోను గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించనుండగా, ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత ఆమన్ గిల్ ఈ నిర్మాణంలో భాగస్వామం కానున్నారు. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, చిత్రాన్ని 2020 ఆగష్టు 28వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే చిత్రంలో క్రికెటర్‌గా కనిపించనున్న షాహిద్ ప్రస్తుతం బ్యాట్ పట్టి ప్రాక్టీస్ సెషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం కూడా అతనికి మంచి విజయం అందిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
previous post